Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
'మన ఊరు - మన బడి' కార్యక్ర మంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం అంచనాలను ధ్రువీకరించుకొని ప్రతిపా దనలను రేపటి వరకు అందజేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించినారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మండల స్పెషల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులతో 'మన ఊరు - మన బడి' పనుల పురోగతిపై మండలాల వారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన ఊరు - మన బడి' కార్యక్రమాన్ని పాఠశాలలు పున: ప్రారంభం అయ్యేలోగా అన్ని హంగులతో పనులను పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇందుకు గాను పారదర్శకంగా ఉండే విధంగా అవసరమైన అంచనాలను పరిశీలంచుకొని శనివారం వరకు అందజేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టానున్న కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్, కిచెన్ షెడ్స్ పనుల ప్రతిపాదనలు రేపటి వరకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారిని రేణుక దేవి, మండల స్పెషల్ ఆఫీసర్లు, డీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.