Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, ట్రు టీచర్స్ కోయలేశన్ (టీటీసీ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పాపగారి ఆశీర్వదం డిమాండ్ చేశారు.శుక్రవారం పాఠశాల విద్యా డైరెక్టర్, సంచాలకులు దేవసేనను కలిసి విద్యారంగ సమస్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల విధుల నుంచి తొలగించిన కేజీబీవీ కాంట్రాక్టు ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని 317 జీవో పెండింగ్ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి, పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. బదిలీలలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఉపాధ్యాయులకు ప్రత్యేక పాయింట్లు కేటాయించాలని కోరారు.రానున్న విద్యా సంవత్సరంలో మనఊరు-మన బడి కార్యక్రమాన్ని అన్ని పాఠశాలలకు వర్తింపజేసి, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వీరి వెంట టీటీసీ రాష్ట్ర కోశాధికారి తొంట కృష్ణ ఉన్నారు.