Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
2021-22 విద్యా సంవత్సరానికి పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ కోసం వికారాబాద్ జిల్లాలోని బీసి, ఈబీసి, విద్యార్థుల నుంచి ఫ్రెష్,రెన్యూవల్ దరఖాస్తులు ఈనెల 21వ తేదీ వరకూ స్వీకరించనున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతను ప్రకారం పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థినీ, విద్యార్థులు తమ వివరాలను ఈ పాస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు కేవలం 9616 మంది విద్యార్థినీ,విద్యార్థులు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్య ప్రతినిధులు ఈపాస్ వెబ్ సైట్ ద్వారా కళాశాల విద్యార్థిని,విద్యార్థుల వివరాలను నమోదు త్వరగా చేయించాలని కోరారు.