Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజి మోటార్ తన సర్వీసింగ్ సెంటర్లను తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేయాలని, వినియోగదారులకు మరింత చేరువ కావాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజి మోటార్ సర్వీసింగ్ సెంటర్‌ను స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంజి మోటార్ ప్రపంచ వ్యాప్తంగా 96 సంవత్సరాలుగా కార్ల తయారీ సంస్థలో అగ్రగామిగా కొనసాగుతుందని ఆయన అన్నారు. ఇంకా కార్ల తయా రీలో నూతన మోడల్స్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ కార్ల తయారీకి ఇదే సరైన సమయం అని తెలిపారు. రాష్ట్రంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి సంస్థలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తుందని పేర్కొన్నారు. ఎంజి మోటార్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ఉదిత్ మల్హోత్ర మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 13 టచ్ పాయింట్‌ను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్రంలో 18 పాయింట్లు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తం గా 310 పాయింట్ కేంద్రాలు నడుస్తున్నాయనిఅన్నారు. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యుత్తమ సర్వీసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ వీలర్స్ సీఈవో అనురాగ్ సింహ, అభిషేక్ స్థానిక నాయకులు నితిన్, మహేష్ ,నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.