Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
- ఇబ్రహీంపట్నంలో ఘనంగా ఈషా హాస్పిటల్ ప్రారంభం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రజలకు అతి తక్కువ ఫిజుతో మెరుగైన వైద్యం అందించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేం ద్రంలో ఈషా హాస్పిటల్‌ను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరై స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, ఎంపీపీ కృపేష్, హాస్పిటల్ యాజమాన్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవ లు అందించేందుకు కార్పొరేట్ హాస్పిటల్స్ నెలకొల్పడం అభినందనీయమని అన్నారు. అందరికీ అతి తక్కువ ఫీిజు లతో వైద్యం అందుబాటులో ఉన్నప్పుడు అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఇక్కడి ప్రజలు మెరుగైన వైద్యం కోసం నగరానికి వెళ్లాల్సి వచ్చేదని, ఇక్కడ కార్పొ రేట్ హాస్పిటల్ నెలకొల్పడంతో ప్రజలు మెరుగైన చికిత్స పొందగలరని అన్నారు. హాస్పిటల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలతో వైద్యాన్ని అందించాలని అన్నారు. అన్ని వసతులతో కూడిన ఈషా హాస్పిటల్ ఉండడం అభినందనీ యమని అన్నారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ ఆకుల యాదగిరి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు భరత్‌రెడ్డి, హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ మహీధర్, డాక్టర్ సంపత్, డాక్టర్ మనోజ్, డాక్టర్ ప్రణరు, కౌన్సిలర్స్ బర్ల మంగా జగదీశ్వర్, మంద సుధా కర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చిలుకల బుగ్గ రా ములు, తులేకలాన్ సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ నాగ మణి, హాస్పిటల్ యాజమాన్యం వెంకటేష్, సురేష్, టీఆర్ ఎస్ నాయకులు జెర్కొని రాజు, భరత్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.