Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బొంరాస్పేట్
మండల పరిధిలోని రేగడి మైలారం గ్రామానికి చెందిన కడంపల్లి కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అనాథలుగా మారడంతో స్థానిక అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఉదార స్వభావంతో స్పందించి విద్యార్థు లను ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. సంఘ సభ్యులు అంతా వ్యక్తిగతంగా విరాళాలు సేకరించారు. పోగు చేసుకున్న రూ.19,000 ఆ ర్థిక సాయంను ఆదివారం అక్క తమ్ముడు అయిన గడ్డంపల్లి వెన్నెల, వంశీలకు అందించారు. అలాగే గ్రామానికి చెందిన విలేకరి అంజిలప్ప, మాజీ ఉప సర్పంచ్ చంద్రప్ప రూ.2వేలతో మొత్తం రూ.21 వేలు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఏసు, బాలు, సభ్యులు వార్డు సభ్యులు ఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.