Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాబాద్
ఆమ్ ఆద్మీ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్‌గా బర్క కృష్ణయాదవ్‌ను నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఇంద్ర శోభన్ ఆదివారం అందజేసినట్టు కృష్ణయాదవ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమాద్మీ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ సోమనాథ్, తెలంగాణ ఇన్చార్జి ఇంద్ర శోభన్ చర్యలు చేపట్టారన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు ఇన్‌ఛార్జిలను నియమిం చినట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నరెడ్ల గ్రామా నికి చెందిన బహుజన నాయకు డిగా ఉన్న తనను నియమించినట్టు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ విజయం చేకూరేలా అన్ని చర్యలు చేపడతామన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవి ఇచ్చిన పార్టీ జాతీయ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.