Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొయినాబాద్
రెడ్డిపల్లి గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బీరప్పల పండుగను మూడు రోజుల పాటు గ్రామస్తులు నిష్ఠగా ఆచారిస్తారని గ్రామ స్తులు తెలిపారు. గ్రామ సర్పంచ్ బసగళ్ల వినీత కరుణాకర్గౌడ్, ఎంపీటీసీ మోర శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా మల్లికార్జున స్వామి కల్యాణ మహా త్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో మల్లన్న బోనాలు ఊరేగింపుతో నైవేద్యం సమర్పించారు. చిందేసిన పోతురాజులతో గ్రామంలో పండుగ కోలాహలం నెలకొంది. ఒగ్గు కథలతో గ్రామం భక్తి పారవశ్యంలో మునిగింది. చుట్టుపక్కల గ్రామస్తులు మహాత్సవాలు తరించడానికి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ వినీత కరుణాకర్, ఎంపీటీసీ మోర శ్రీనివాస్ మా ట్లాడుతూ మల్లన్న ఉత్సవాలు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో కోలవాలని, స్వామి దీవెనాలతో గ్రామ జనం, పశుపక్షాదులను ఆశీర్వదించాలని, రానున్న రోజుల్లో గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.