Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
ఈ నెల 25న వనపర్తిలో నిర్వహించే స్వేరోస్ విక్టరీ డే సభను విజయవంతం చేయాలని స్వేరోస్ ఇంట ర్నషనల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నపూర్ శ్రీనివాస్ కోరారు. ఆదివారం మండలకేంద్రంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సభకు సంబంధించిన పోస్ట ర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అతిపిన్న వయస్సులో ఆధిరోహించిన మాలవత్ పూర్ణ, సాదనపల్లి ఆనంద్, అధిరోహించిన సందర్భంగా స్వేరోస్ విక్టరీ డేని జరుపుకుంటామని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగే ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు స్వేరోస్ ఫౌండర్, చైర్మెన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరవుతారని అన్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిం చిన పూర్ణ ఆనంద్ కూడా హజరవుతారని అన్నారు. చదువు, వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థులను (నిట్ ఎంబీబీఎస్) వివిధ యూనివర్సిటీలో సీట్లు సాధించిన వారిని సత్కరిస్తామని తెలిపారు. ఈ సభకు అంబేద్కర్, ఫూలే, బహుజన వాదులు, యువకులు, విద్యావంతులు, మేదావులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ నియోజకవర్గ యువజన నాయకులు శ్రావణ్‌కుమార్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు అంజి రావణ్, బీఎస్పీ నాయకులు సాలేటి వెంకటేష్, రాకొండ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బండి నర్సింలు, శ్రీనివాస్, నర్సింలు, రాములు, తదితరులు పాల్గొన్నారు.