Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సురేష్
నవతెలంగాణ-కేశంపేట
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు పాదయాత్ర సందర్భంగా కేశంపేట మండల కొత్తపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను డ్యామేజ్ చేశారన్న కారణంతో నిర్దావెళ్లి శ్రీనును పోలీసులు చితకబాదని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గ్యార సురేష్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సురేష్ మాదిగతోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీనును కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా సురేష్ మాదిగ మాట్లాడుతు సదరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీను తప్పు చేసి ఉంటే కేసు నమోదు చేయాల్సిన రక్షకులే భక్షకులై పోలీసులు శ్రీనుపై విచక్షణ రహితంగా చితకబాదడం ఎంత వరకు సమం జసమని ప్రశ్నించారు. పోలీసులకు ఇంత అత్యు త్సాహం సరికాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిర్దవెల్లి శ్రీనుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పరామర్శించిన వారిలో ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షులు కిష్టయ్య, కళ్ళుసాయిలు, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్య క్షుడు చిర్రశీను, నిడుద వెళ్లి జంగయ్య, వార్డ్ సభ్యులు కుమార్, వెంకటేష్, కృష్ణ, మల్లేష్, శ్రీను, యాదయ్య, బాలరాజ్, దైవం రమేష్, తదితరులు పాల్గొన్నారు.