Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ పి.శ్రీనునాయక్
నవతెలంగాణ-మంచాల
గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ పి.శ్రీనునాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని ఎల్లమ్మ తండ గ్రామంలో ఆయన మాట్లాడుతూ గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారించాలన్నారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు, కాస్తు కాలంలో ఉన్న భూములకు రికార్డులు రాసి వారికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కొత్తగా ఏర్పడిన గ్రామాలను రెవెన్యూ గ్రామాల కు మార్చాలన్నారు. గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. విద్య, వైద్య రంగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా రఘువీర్, ఉపాధ్యక్షులుగా జవహర్ లాల్, బిచ్చునాయక్ కార్యదర్శిగా వెంకటేశ్, సహాయ కార్యదర్శులుగా నవీన్ నాయక్, చంటినాయక్, కోశాధికారిగా సీతారాంనాయక్, కమిటీ సభ్యులుగా రవి, శ్రీధర్ నాయక్, రాములు, లచ్చిరాం, రామారావులను ఎన్నుకున్నట్టు తెలిపారు.