Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి వనం నర్సింహ
- యాచారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి సమావేశం
నవతెలంగాణ-యాచారం
వర్గీకరణ పేరుతో మాదిగలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తూనే ఉన్నాయని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి వనం నర్సింహ ఆరోపించారు. ఆదివారం యాచారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు మాదిగల అంతా కృషి చేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించినట్టు తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలను చిన్నచూపు చూస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల పనితీరును మాదిగల అంతా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వర్గీకరణను వెంటనే చేపట్టాలని డిమాండ చేశారు. ఈ కార్యక్రమంలో రావుగల్ల బాబు, మదిలేటి, బక్కని రవి, ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి కొమ్ము మహేష్, ముచ్చర్ల ఆనంద్, కాళ్ల పాండు, నవీన్, మూలి మహేష్, చంద్రకాంత్, రాము, జయ కృష్ణ, సాయిలు, ప్రభాకర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.