Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరర్
మనుషుల శాశ్వతం కాదు, వారి జీవిత కాలంలో సమాజ సేవ చేసేవారు చిర కీర్తిని పొందుతారని ప్రముఖ సామాజిక సాహితీ వేత్త డాక్టర్. బి. ఎస్.రాములు అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని లలిత కళా వేదికపై కళా నిలయం సాంస్కృతిక సంస్థ నిర్వాహణలో చేనేత సామాజిక ఉద్యమ నాయకుడు, సంఘ సేవకులు చిక్కా దేవ దాస్ జన్మ దిన సందర్భంగా కళా సేవా రత్న బిరుదును డాక్టర్ రాములు బహుకరించి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవ దాస్ చేనేత వస్త్ర కార్మికులు లకోసం జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేశారన్నారు. వారి సంక్షేమమే లక్ష్యంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పూర్వ న్యాయ మూర్తి బి. మధుసూదన్, గాన సభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి విశ్రాంత పోలీస్ అధికారి సుంకర సత్యనారాయణ, నాట్య గురువు డాక్టర్ భారతి తదితరులు పాల్గొన్న సభకు సురేందర్ స్వాగతం పలికారు. వేదికపై వివిధ రంగ ప్రముఖులకు దేవ దాస్ ప్రతిభా పురస్కరాల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి తొలుత జ్యోతిక రెడ్డి శిష్య బృందం భరత నాట్య ప్రదర్శన ఆకట్టుకొంది.