Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
ప్రముఖ సంగీత గురువు ఉమ రమణ శిష్య బృందంతో శ్రీత్యాగరాయ గాన సభలోని లలిత కళా వేదికపై అన్నమాచార్య జయంతిని పురస్కరించుకుని సంకీర్తన గాన ఝరి రస రమ్యంగా నిర్వహించారు. ప్రాచుర్యంలో ఉన్న కీర్తనలతో పాటు అరుదైన కీర్తనలను మధురంగా గానం చేశారు. ఐదు సంవత్సరాల బేబీ వైష్ణవి నుంచి యాభైపై పడిన రామ్ గోపాల్, లక్ష్మీ , రాజ్యం తదితరులు యాభై మంది పైగ గాయకులు తమ గలలలో కీర్తనలు పారవశ్యంగా ఆలపించారు. ముఖ్య అతిథిóగా సంఖ్యా శాస్త్రవేత్త డైవజ్ఞ శర్మ పాల్గొని మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య అని, వేల వేల ఆయన కీర్తనలు బాలల నుంచి వృద్ధులు వరకు పాడుకొంటున్నారని అన్నారు. ఉమ రమణ శిక్షణలో గాయకులు కెకీర్తనలను గానం చేయటంలో రాటు తెలారని అభినందించారు.