Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ
- నంది వనపర్తిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ-యాచారం
పూర్వ విద్యార్థులు ఎక్కడ ఉన్నా, ఏ వృత్తిలో పనిచేస్తున్న నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ అన్నారు. ఆదివారం యాచారం మండల పరిధిలోని నంది వనపర్తి లో 1999-2000 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి తమకు విద్యాబుద్ధులు నేర్పిన పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సర్పంచ్ మాట్లాడుతూ ఒకరికి ఆపద వస్తే ఆదుకోడానికి పూర్వ విద్యార్థులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. సమాజంలో సేవాగుణం అలవర్చుకో వాలని తెలిపారు. పూర్వ విద్యార్థులంతా ఒక చోట కనిపించడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, బి.యన్.రెడ్డి ట్రస్ట్ చైర్మెన్ బిలకంటి శేఖర్‌రెడ్డి, నందివనపర్తి మాజీ సర్పంచ్ వర్త్యవత్ రాజునాయక్, నిర్వాహకులు కాళ్ళ జంగయ్య, చింతపల్లి వరప్రసాద్‌రెడ్డి, గుంటోజ్ రవిచారి, కొండాపురం పాండు, బాల్‌రాజ్, బుగ్గ రాములు, పగిల్ల జంగయ్య, వన్నవాడ లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.