Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన
- రూ. కోటీ 28లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ-తాండూరు రూరల్
వచ్చే రెండేండ్లలో తాండూరు రూపురేఖలు మారుస్తా నని తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు.ఆదివారం తాండూరు మండలం మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, ఐనెల్లి, కోట్బాస్పల్లి, కోత్లాపూర్, మల్కాపూర్, జిన్గుర్తి గ్రామాల్లో రూ. కోటీ 28లక్షల విలువైన పలు అభివృద్ధికార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాండూరు మండల మిట్టబాస్పల్లిలో నిర్మించిన శ్మశాన వాటిక, గుంత బాస్పల్లి గ్రామంలో సీసీరోడ్లతో పాటు గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి రైతులు బ్రహ్మర థం పడుతున్నారని అన్నారు. రెండు సంవత్సరాల్లో తాండూరు నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయని తెలి పారు. ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిందన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. 'మన ఊరు-మన బడి' కింద రూ.7,300 కోట్లు వెచ్చించి ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోసం ఎదురుచూపులు ఉండేవనీ, తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ వచ్చాక అన్నీ రంగాల్లో అభివృద్ధి జరుగుతుంద న్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీజీ స్ఫూర్తితో పల్లె, పట్టణ ప్రగతి. అడవుల పెంపుదలకే హరితహారానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే దళితబంధు పథకం తీసుకొచ్చినట్టు తెలిపా రు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు నాగార్జున, జగదీష్, నరేందర్‌రెడ్డి, విజయలక్ష్మి, పాండరీ, స్వప్న జ్యోతి, చంద్రశేఖర్‌రెడ్డి, రత్నమ్మ, మార్కెట్ కమిటీ చైర్మెన్ విఠల్ నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయి రెడ్డి(నరేంధర్ రెడ్డి), వైస్ ఎంపీపీ స్వరూపరాణి, సర్పంచులు నరేందర్ రెడ్డి, రాజప్పగౌడ్, జగదీష్, స్వప్న చంద్రశేఖర్ రెడ్డి, ఉప సర్పంచులు గోవిందు, కైరతలీ, వెంకటేష్‌గౌడ్, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు శకుంతల, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భీమ్ రెడ్డి, మల్లప్ప, పంచాయతీ రాజ్ వేంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు ఉమాశేఖర్, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తాండూరు మండలం వీరారెడ్డిపల్లి గ్రామం శివారులో వెలిసిన వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం పార్వతీ పరమేశ్వరుల కల్యాణం నిర్వహించారు. విజరుకుమార్, విజయలక్ష్మి, గోవర్దన్‌రెడ్డి, కమలమ్మ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరై కల్యాణంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.