Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు బుస్సు మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ-యాచారం
నిరుపేదలు బతకకుండా కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాల పైన ధరల రూపంలో భారాలు మోపుతోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు బుస్సు మధుసూదన్‌రెడ్డి మండిపడ్డా రు. ఆదివారం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఒక సిలిండర్ పైన రూ.50లు పెంచి పేదలపైన రూ.11 వందలకు పైగా భారం మోపిందని అన్నారు. మూడేండ్లుగా కరోనాతో ప్రజలంతా ఉపాధి కోల్పోయి పెరిగిన ధరలతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా కరెంటు చార్జీలను పెంచి పేదల నడ్డి విరుస్తోందని విమర్శించారు. తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు ధరలు భగ్గుమంటున్నాయని తెలిపారు. బీజేపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.