Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
నవతెలంగాణ-కుల్కచర్ల
బొంరాస్పేట్ మండల పరిధిలోని అలీఖాన్పల్లి గ్రామంలో నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంరను విజయవంతం చేయాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ పిలుపు నిచ్చారు. ఆదివారం కుల్కచర్ల మండల కేంద్రంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా పలువురు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్ర మానికి బహుజన నాయకులు, అంబేద్కర్ వాదులు, కుల సంఘాలు, అంబే ద్కర్ సంఘాలు, దళిత సంఘాలు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు అంజి రావణ్, యువజన సం ఘాల నాయకులు అంజి, శ్రీనివాస్, మొగులయ్య, కృష్ణ య్య, వెంకట్, చందు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.