Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మోమిన్ పేట
మండల పరిధిలోని రాళ్లగుడి పల్లి తమ సొంత గ్రామానికి చెంది న జాతీయ అధ్యక్షులు ఆర్ కృష ్ణయ్య పెద్దల సభకు ఎంపిక చేసిన ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ప్రతి బీసీ కుటుంబం రుణపడి ఉంటారని మండల బీజేవైఎం అధ్యక్షుడు అశిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని బీసీ భవన్ లో ఆర్ కృష్ణయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానిం చారు. 47 ఏళ్ల నుంచి బీసీల కోసం ఎన్నో పదవులను, ఉద్యోగాలను, త్యాగం చేసి విద్యార్థుల కోసం అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితమే పెద్దల సభకు ఎంపిక కావడం సంతోషించదగ్గ విషయమన్నారు. త్వరలోనే తమ సొంత గ్రామంలో గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విఠల్, గ్రామస్తులు పాల్గొన్నారు.