Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసు వివరాలను వెల్లడించిన ఏసిపి కుశల్కర్
నవతెలంగాణ-కొత్తూరు
కొత్తూరు అండర్‌పాస్ దగ్గర ఈ నెల 9వ తేదీన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను షాద్‌నగర్ ఏసీపీ కుశల్కర్ సిఐ బాలరాజుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. హత్య జరిగిన అనంతరం కేసు ను చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు సిఐ బాలరాజు నేతృ త్వంలో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి హత్య జరిగిన పది రోజుల్లోనే నిందితులను గుర్తించి రిమాండ్‌కు తరలించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మృతుడు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. స్థానికంగా అతనికి ఎవరితో ఎలాంటి వైరం లేకపోవడంతో నింది తులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. కేసు పరిశోధనలో భాగంగా హత్య జరిగిన ప్రదేశంలోని ఆధారాల కోసం దగ్గరలో ఉన్నటువంటి ఆరు ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను వీక్షించారు. అలాగే 15 మంది పాత నేరస్తులను విచారించి నేరస్థలం వద్ద లభించిన ఆధారాల తో ఇన్ఫర్మేషన్ సిస్టం డెవలప్ చేసి బుధవారం మధ్యాహ్నం షాద్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో తహిర్ (17 ) అభి షేక్ (16) లను అరెస్టు చేసి జునైల్ హౌంకు తరలించారు. పది రోజుల్లోనే హత్యకేసు మిస్టరీని ఛేదించి, నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర వహించిన సిఐ బాలరాజు, ఎస్సై శంకర్, ఏఎస్ఐ అబ్దుల్లా, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్స్ కుమార్, శ్రీనివాస్, హరీష్‌లను ఈ సందర్భంగా ఏసిపి కుశల్కర్ అభినందించారు. తల్లిదం డ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టాలని తమ పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారో గమనిస్తుండాలని ఏసీపీ అన్నా రు. యువత మత్తు పదార్థాలు అలవాటు పడుతున్నారని అట్లాంటి ఆనవాళ్లు కనిపిస్తే పిల్లలు చెడు దారిన పడకుం డా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. మైనర్ పిల్లలకు బైక్‌ల ను ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజారు డ్రగ్స్ లాం టి మత్తు పదార్థాలకు కొత్తూరు అడా ్డగా మారిందని వాటిని అరికట్టడానికి పూర్తిస్థాయిలో పోలీసులు చర్యలు తీసుకోవా లని స్థానికులు కోరుతున్నారు. మత్తు పదార్థాలు వాడకం వలన యువతనే కాకుండా మైనర్లు సైతం చెడు అలవాట్ల కు అలవాటుపడి మత్తులో నేరాలకు పాల్పడు తున్నారని పేర్కొన్నారు. మత్తుపదార్థాలను వాడిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.