Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు
- సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు సాయిబాబు
నవతెలంగాణ-రాజేంద్రనగర్
పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసు కొని ముందుకు నడవాలని సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు సాయి బాబు అన్నారు. సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని ఆయన అన్నారు. గురువారం రాజేంద్రనగర్లోని బుద్వేల్లో భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన సుందరయ్య వర్ధంతి, సహపంక్తి భోజ న కార్యక్రమంలో సాయిబాబా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సుందరయ్య చిత్రపటానికి సాయిబాబా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పు చ్చలపల్లి సుందరయ్య జీవిత మొత్తం ప్రజాసేవకే అంకితం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. మొదట తన ఊర్లో దళితు ల మీద వివక్ష చూపుతున్నారని మొట్టమొదటిసారిగా గ్రామంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దళితుల మీద చూపుతున్న వివక్ష మీద పోరా టం చేశారన్నారు. అసమానతలను తగ్గించడానికి ప్రజల ను చైతన్య పరిచారని తెలిపారు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మ కాలను కుల మత విద్వేషాలను రూపుమాపడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. భారత స్వాతంత్రోద్యమంలో సుందరయ్య పోషించిన పాత్ర చాలా కీలకమని ఆయన అన్నారు. నేటి బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టి కార్మికుల మధ్య కుల, మత గొడవ లు సష్టిస్తుందని ఆయన అన్నారు. కార్మికులను ఐక్యమత్యా న్ని చెడగొట్టి వారి మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్న ఈ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసి దేశ సంపద ను మొత్తం కొల్లగొడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివద్ధి చెందుతున్న మరోవైపు మతవిద్వేషాలు పేరుతో భారత దేశ అభివద్ధిని ఈ బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన అన్నారు. పెట్టుబడిదారులు తమ లాభాల కోసం కార్మిక వర్గాన్ని దోచుకుంటున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీసి ప్రయి వేటు రంగ సంస్థలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వడం తో కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర గిరిజన ప్రాంతాల్లో కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కార్మికులను పూర్తిగా బానిసలుగా తయారు చేసి పని చేయించుకుం టున్నారని అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులకు జరుగుతున్న అన్నిరకాల దోపిడీని అడ్డుకుం టుందని ఆయన అన్నారు. అదేవిధంగా కార్మికులను ఐక్యమత్యంగా తయారుచేసి వారి సమస్యల పరిష్కారానికై పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం ఆయన భవన నిర్మాణ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. తర్వాత సాయిబాబా కార్మికులకు, పిల్లలకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, ఉపాధ్యక్షులు కురుమయ్య నాగరాజు, చంద్రశేఖర్ ,రాజు, రంగస్వామి, నర్సింగ్ రావు, స్వామి తదితరులు పాల్గొన్నారు.