Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్
నవతెలంగాణ -వికారాబాద్ రూరల్
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 'మీతో నేను' కార్యక్రమంలో భాగంగా గురువారం ధారూర్ మండ ల పరిధిలోని గురుదోట్ల ఊరివెనుక తండా, బిల్యానా యక్ తండా, గురుదోట్ల గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై ఆరాతీశారు. గురుదోట్ల గ్రా మంతో పాటు ధారూర్ మండలంలో వరి కొనుగోలు కేం ద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులతో మాట్లా డారు. కూడుకుపోయిన చెరువు కాలువను పరిశీలించి, గ్రామస్తులకు ఇబ్బంది కాకుండా సరిచేయాలని, సంబంధి త అధికారులను ఆదేశించారు. గ్రామంలో నిరూప యోగం గా ఉన్న పాత పాఠశాల భవనాలను పరిశీలించి, ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఊరి వెనుక తండాకు రోడ్డు నిర్మాణానికి కృషి చేద్దామని సంబంధిత అధికారులతో మాట్లాడారు. గ్రామం లో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, ఓల్టేజ్ సమస్య ఉందని కొత్త ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేయాలని, ఇళ్లపై, పంటపొలాల్లో వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేయాలన్నారు. బిల్యా నాయక్ తండాలో నిరూపయోగంగా ఉన్న స్థంభా లను తొలగించి, కొత్తలైన్ ఏర్పాటు చేయాలన్నారు. తండాలోని మిషన్‌భగీరథ మంచినీటిని ట్యాంక్‌లో నీటిని నింపుతూ రెండు తండాలకు సరిపడ నీరు అందించాలని అధికారు లను ఆదేశించారు. ప్రతీ గురువారం పశువుల డాక్టర్ అందుబాటులో ఉండాలని, పశు వైద్య అధికారులను ఆదే శించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.