Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్
- వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు కాన్గుల వెంకటయ్య
నవతెలంగాణ-ఆమనగల్
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పూరితంగా రెండు పూటల పని విధానాన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్నాయని వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కాన్గుల వెంకటయ్య ఆరోపించారు. తలకొండపల్లి మండలంలోని మెదక్పల్లి గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాలను గురువారం కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు శివగల్ల రమేష్ తదిత రులతో కలిసి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, రెండు పూటల పని విధానాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. అంతకు ముందు దుబ్బ చెన్నయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కూలీలను ఉపాధి పనులకు దూరం చేస్తున్నాయని ఆరోపించారు. పనిచేస్తున్న ప్రదేశా ల్లో కూలీలకు కావలసిన మౌలిక వసతులు కల్పించాలని, వారికి కావలసిన పనిముట్లు అందించాలని డిమాండ్ చేశా రు. ఉపాధి కూలీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెం టనే చెల్లించాలని లేదంటే మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి ప్రభత్వ యంత్రాంగాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కూలీ అంజయ్య, రామస్వామి, పుల్లయ్య, అంజమ్మ, నవనీత, ఎల్లమ్మ, నరసమ్మ, కృష్ణ, జానమ్మ తదితరులు పాల్గొన్నారు.