Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా నాయకులు ఎన్ రాజు
- గూడ్స్ వెహికిల్, ఆటో, క్యాబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ
నవతెలంగాణ-షాద్‌నగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల నడ్డి విరుస్తు న్నాయని, వాహనాలపై పన్ను భారం పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఐటీయూ జిల్లా నాయ కులు ఎన్ రాజు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సంవత్సరంలో మోటార్ వాహనాల చట్టం 2019ని సేఫ్టీ పేరుతో భారీ చలాన్లు పెంచుతూ తెచ్చిన చట్టాన్ని నిరసిస్తూ సీఐటీయూ, లోకల్ ఆటో యూనియన్, లారీ ఓనర్స్ అసోసియేషన్, గూడ్స్ వెహికిల్ అసోసియేషన్, క్యాబ్‌డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షాద్‌నగర్ రైల్వే స్టేషన్ నుండి ముఖ్య కూడలి వరకు రాస్తారోకో నిర్వహిం చారు. ఆర్టిఓ కార్యాల యాన్ని ముట్టడించి పలు సమస్య లతో కూడిన వినతిపత్రాన్ని మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయ కులు ఎన్ రాజు మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా మోటార్ వాహన యజమానులు, కార్మికులు నడ్డి విరిచి లక్షలాది రూపాయల పెనాల్టీలు వేసి,కార్మికుల బతుకులపైన పెను భారం మోపుతోందన్నారు. వాహన కొనుగోలు దానిపైన తెలంగాణ ప్రభుత్వం పన్నుల భారం మోపిందని, వాహ నాల జీవితకాల పన్ను 2,3 అంచెలుగా పెంచిందన్నారు. ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తే ఇప్పటివరకు 9,000 చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇకనుంచి 12000 జీవితకాల పన్ను చెల్లించాలన్నారు. ఇలా అన్ని వాహనాల పైన విపరీ తమైన పన్నులను పెంచి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 1 నుండి జీవో నెంబర్ 714 ప్రకారం ఫిట్నెస్ రెన్యువల్ గడవైన తర్వాత రోజుకు 50 రూపాయల చొప్పున పెనాల్టీ లు వేస్తున్నారన్నారు. ఫీట్నెస్ రెన్యూవల్ పై రోజుకు 50 రూపాయల ఫెనాల్టీ రద్దు, రోడ్ సేఫ్టీ బిల్లును 2019 రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చంద్రమౌళి, కె రాజు, శ్రీను నాయక్, ధన్ రాజ్, శ్రీశైలం, మల్లేష్, కలీమ్, సాయికుమార్, రామారావు, జిలానీ, జబ్బ ర్, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.