Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోకిలా రైతులు
నవతెలంగాణ-శంకర్పల్లి
'మా భూములపై మాకు పూర్తి హక్కు కల్పించాలని' మోకిలా గ్రామ రైతులు ఆనంద్, నర్సింలు పాపయ్య ,గోపాల్ ,ఖాదర్ పాషా అన్నారు. గురువారం ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషనర్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్లకు గురువారం పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని మోకిల గ్రామంలో సర్వేనెంబర్ 96,197లో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలకు 700 ఎకరాల భూమి లావణి పట్టా వంద ఏండ్ల క్రితం ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన భూములు అన్ని అన్నారు.ఆ భూముల్లో అన్ని రకాల పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తామంటూ సాగు చేసుకుంటున్న భూములు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూములను ప్లాట్లుగా చేసి గజాలుగా ఇస్తామని వారు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషనర్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ స్పందించి తమ భూములు తమరూ ఉండే విధంగా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మోకిల గ్రామ రైతులు తదితరులు ఉన్నారు.