Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల బ్రహ్మయ్య
- మండల కేంద్రంలో కార్మికులతో నిరసన
నవతెలంగాణ-యాచారం
రవాణా రంగాన్ని ప్రభుత్వాలు కాపాడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. గురువారం యాచారం మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా బందును జయప్రదం చేస్తూ ఆటో కార్మికులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిట్నెస్ రెన్యూవల్ పై రోజుకు రూ.50లు పెనాల్టి రద్దు చేయాలన్నారు.దీంతో కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు భారాన్ని మోపుతున్నాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 మోటార్ వాహనాల చట్టం సేఫ్టీ పేరుతో భారీ చలానాలు విధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కార్మికులపై లక్షలాది రూపాయల భారాలు వేస్తే వారు జీవనం సాగించేదెలా అన్ని ప్రశ్నించారు. వాహనాల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం భారాలు వేస్తుందన్నారు.ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేటప్పుడు రూ.9 వేలు వినియోగదారుడు చెల్లిస్తున్న పన్ను రూ.12వేలకు పెంచిందని, దీంతో అదనంగా రూ.3వేల భారం పడుతుందని గుర్తు చేశారు. ఏప్రిల్ ఫస్ట్ నుండి జీవో నెంబర్ 714 ప్రకారం ఫిట్నెస్ రెన్యూవల్ పై రోజుకు రూ.50ల చొప్పున పెనాల్టీలు వేస్తున్నాయని బ్రహ్మయ్య వెల్ల డించారు. ప్రభుత్వాలు ఖజానాను నింపుకు నేందుకు ఆటో, క్యాబ్, లారీ కార్మికులపై భారీ జరిమానా విధించడానికి పూనుకుంటు న్నారని ఆరోపించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి రవాణా రంగాన్ని ప్రభుత్వాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఆలంపల్లి యాదయ్య, వెంకటేష్, దవలయ్య, పాండు, శ్రీ రాములు, శంకరయ్య, మల్లేష్, యాదయ్య, రాజు, మైసయ్య పాల్గొన్నారు.