Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ గ్రామానా రచ్చబండ కార్యక్రమం
- రైతును నట్టేట ముంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలి
- టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ను గ్రామ గ్రామాన రచ్చబండ కార్యక్రమంతో ప్రజలల్లోకి తీసుకుపోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి పిలుపునిచ్చారు. ఇందిరా భవన్లో గురువారం కాంగ్రెస్ రంగారెడ్డి అధ్యక్షులు చల్ల నరసింహ్మరెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన జిల్లా విస్తృస్థాయి సమావేశానికి ముఖ్యఅతిధులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కోదండ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలు హాజరయ్యారు. ఈసందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, రైతులకు, కౌలుకు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీనిచ్చారు. ఉపాధి హామిలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించి, పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని చెప్పారు. మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామని తెలిపారు. రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టపర అధికారాలతో రైతు కమీషన్ వేస్తామన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు చల్ల నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానిచ్చిందన్నారు. ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న రంచబండ కార్యక్రమంతో టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ఎండగడుతమన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇలా అనేక సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ పార్టీనీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.