Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుట్లలో ఎర్రజెండా ఎగరవేసి, పూర్వవైభవం తీసుకువద్దాం
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.జంగారెడ్డి
నవతెలంగాణ-మంచాల
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు పార్టీ కార్యాలయం పోరాటాలకు కేంద్రం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.జంగారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయం ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరుట్ల గ్రామం ఉద్యమాలకు, పోరాటాలకు కేంద్ర బిందువనీ, సాయుధ పోరాటం, భూపోరాటం స్థానిక పోరాటాల్లో కీలకంగా పాత్ర పోషించిందన్నారు.ఈ పోరాటంలో ఎంతో మంది కార్యకర్తలు , ప్రజలు పార్టీకి అంకితమై పని చేశారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఆరుట్లలో ఎర్రజెండా ఎగుర వేసి పూర్వ వైభవం తీసుకవస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య మాట్లాడుతూ ఆరుట్ల గ్రామంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ, విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో అమరులైన చరిత్ర కూడా ఉందన్నారు. భూమి లేని నిరుపేద ప్రజలకు భూములు పంచినట్టు తెలిపారు. కామ్రేడ్ సుందరయ్య వర్థంతి సందరర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు రావుల జంగయ్య, పార్టీ మండల కార్యదర్శి మాగిళ్ల శ్యాంసుందర్, గ్రామ కమిటీ కన్వీనర్ పుల్లగల్ల గోపాల్, మండల కమిటి సభ్యులు పొచమొని క్రిష్ణ, మార బుగ్గరాములు, కొండిగారి బుచ్చయ్య, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యులు ఎండీ యూసుఫ్ ఆలీ, పీఎన్ఎం నాయకులు ఎం జె వినోద్, శాఖ కార్యదర్శులు పూజారి ప్రభాకర్, చిందం క్రిష్ణ, నాయకులు శంకరయ్య, విజరు, చంద్రయ్య, అంజయ్య, మల్లేష్, భూపాల్ ఉన్నారు.