Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 రోజుల్లో 12 విభాగాల్లో పనులు పూర్తి
- పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ అధికారులకు ఆదేశాలు
- మన ఊరు- మన బడి కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని కోర్టు హాల్లో మన ఊరు-మన బడి, మన బస్తి -మన బడి కార్యక్రమంపై రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, కమిషనర్ దేవసేన, ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి పాఠశాలలు పున్ణప్రారంభం అయ్యే నాటికి సకల సౌకర్యాలతో సిద్ధం అయ్యే విధంగా పనులు చేపట్టాలని కలెక్ట రుకు, అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 9300 పాఠశాలలను ఆధునీకరించి మౌళిక సదుపాయాలు కల్పించేం దుకు నిర్ణయించినట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1309 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, తొలి విడతలో గ్రామీణ ప్రాంతంలో 304 పాఠశాలలు, అర్బన్‌లో 160 పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని 464 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. అయితే తొలి విడతలోనే దాదాపు 65 శాతం విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం అమలవుతున్న బడులలో అన్ని వసతులు, చక్కటి వాతావరణం కల్పించడం ద్వారా కార్పొరేట్ స్కూళ్లను మరిపించే విధంగా ప్రభుత్వ పాఠ శాలలను తీర్చిదిద్దాలని సూచించారు. అవసరమైన చోట మరమ్మతు పనులను చేపడుతూ లైబ్రరీ, ప్రహరీ, కిచెన్ షెడ్స్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నీచర్, డిజిటల్ విద్యా బోధనకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. అవసరమైన పనులను మాత్రమే గుర్తించి పాఠశాలలను పున:ప్రారంభించే నాటికి అధికారులు ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల వారు సమిష్టిగా పనిచేస్తూ ప్రభుత్వ బడులను బాగు చేసుకుందామని మంత్రి పిలుపునిచ్చారు.
ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న ప్రభుత్వ బడులకు విరివిగా విరాళాలు అందించి సర్కారీ బడుల అభ్యు న్నతి కోసం తోడ్పడాలన్నారు.ఈ మేరకు పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, ప్రధానో పాధ్యాయులు పూర్వ విద్యార్థులను, ఇతర దాతలను సంప్రదించి ప్రభుత్వ బడులకు విరాళాలు సమకూర్చుకోవా లని సూచించారు. ఈ విద్య సంవత్స రం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మద్య మంలో బోధన చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ విషయం పైన జూన్ 1 నుంచి బడి బాట, జూన్ 3 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిపిం చాలన్నారు. విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలో అధిక సంఖ్యలో చేరేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు ఆంగ్ల మద్యమంలో బోధన చేయుటకు శిక్షణ ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోరు కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో గుర్తించిన 464 పాఠశాలకు పరిపాలన అనుమ తులు ఇచ్చామనీ, ఈ పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సూచనలు అన్ని పాటించి పాఠశాలలో పున్ణప్రారంభం అయ్యేలోగా పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర విధ్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మెన్ శ్రీధర్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరి నాధ్ రెడ్డి , ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి , సురభి వాణి దేవి , ఎగ్గే మల్లేశం , జనార్ధన్ రెడ్డి, శాసన సభ్యులు సుదీర్ రెడ్డి ,ఆర్.కె.పూడి గాంధీ, కాలే యాదయ్య ,అంజయ్య యాదవ్ , అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లా విద్యా శాఖధికారి సూసిందర్ రావు, జిల్లా పరిషత్ సిఈఓ దిలీప్ కుమార్ , డీఆర్డీవో పీడీ ప్రభాకర్, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.