Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ ,
- జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య
నవతెలంగాణ-మంచాల
కా,పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్వెస్లీ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని క్రిష్ణమూర్తి భవన్లో కా.సుందరయ్య 37 వ వర్థంతి సందర్భంగా వారు మాట్లాడుతూ పీడిత ప్రజల విముక్తి, దోపిడీ అసమానతలు లేని సమాజ నిర్మాణానికి అలుపెరుగని కృషి చేశారని కొనియాడారు. దక్షిన భారతదేశ కమ్యునిస్టు ఉద్యమ నిర్మాత ఎలాంటి ఆడంబరాలు లేకుండా సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లిన నాయకుడని కొనియాడారు. పేదలే తన పిల్లలు అనుకుని నిస్వార్థ జీవితం గడిపిన విప్లవ బాటసారి సుందరయ్య అన్ని అన్నారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. దోర నీ కాళ్లు మొక్కుతా నీబాంచన్ అనే చోట తుపాకి పట్టి తెలంగాణ సాయుధ పోరాటం చేసి, నిరుపేదలకు భూములు పంచిన చరిత్ర సుందరయ్యకే ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ బాటలో కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నాగిల్ల శ్యామ్ సుందర్, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, రావుల జంగయ్య, మండల కమిటీ ఆవుల యాదయ్య, కె.జంగయ్య, బచ్చయ్య, ఆర్ స్వామి , రంగాపూర్ సర్పంచ్ పల్లాటి బాల్ రాజ్, మమత, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.