Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి
నవతెలంగాణ-పూడూర్
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధుతో దళితులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండల కేంద్రంలో దళితబంధులో మంజూరైన వాహనాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా వెనుకబడినవారు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేని దళితబంధు పథకం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు.దళితులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండో విడత భాగంలో ప్రతి గ్రామానికి పది నుంచి పదిహేను మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మల్లిపెద్ది మేఘమాల ప్రభాకర్ గుప్తా, స్థానిక సర్పంచ్ నవ్య నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ రాజేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ఎండీ అజారుద్దీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైపాల్ రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు అనంత్ రెడ్డి, పార్టీ మండల యూత్ అధ్యక్షులు,మాజీ సొసైటీ చైర్మన్ పీ నర్సింహా రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.