Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అవార్డులు అందజేత
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిది
స్వయం సహాయక గ్రూప్ బ్యాంక్ లింకేజ్‌లో రంగారెడ్డి జిల్లా రాష్ట్ర స్థాయిలో మూడు అవార్డులు సాధించింది. కెనరా బ్యాంక్ నర్కుడ బ్రాంచ్, శంషాబాద్, మండల సమైక్య ఇబ్రహీంపట్నం, కడ్తాల్ మండ లాలకు గురువారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాలు అవార్డు అందించడం జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి స్వయం సహాయక గ్రూప్‌లకు రూ. 563.57 కోట్లు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయిం చగా రూ. 612.69 కోట్లు ప్రగతి సాధించడం జరిగింది. ఈ సంద ర్భంగా రంగారెడ్డి జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి పి.ప్రభాకర్ మాట్లా డుతూ జిల్లా కలెక్టర్ అమోయి కుమార్ ప్రోత్సాహం, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ సూచన మేరకు ఈ లక్ష్యాన్ని అధిగమించామని తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోతామన్నారు.