Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-మర్పల్లి
దళితుల సంక్షేమమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో దళితబంధు పథకం కింద మంజూరైన యూనిట్లను తొమ్మిది మంది లబ్దిదారులకు ట్రాక్టర్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుం దన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ద్వారా లబ్దిపొందిన లబ్దిదారులు యూనిట్లను సద్వినియోగించుకుని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. దళితులందరికీ దశలవారీగా దళితబంధు చేకూరు తుందన్నారు. అన్ని వర్గాల వారితో సమానంగా ఆర్థిక ప్రగతిని సాధిం చాలని మరో పది మందికి ఉపాధి కల్పించాలనే బృహత్ సంకల్పంతో ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.