Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భగీరథ అధికారుల పొంతనలేని సమాధానాలు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో నాన్యతలేని సీసీరోడ్లను వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు సామెల్ అన్నారు. ఇదేమటని అడిగితే మున్సిపల్, భగీరథ అధికారులు పొం తన లేని సమాధానాలు చెబుతున్నారని విమ ర్శించారు. ఇబ్రహీంపట్నం ఆంధ్రాబ్యాంక్ నుంచి బ్రిలియంట్ స్కూల్ వరకు వేసిన సీసీరోడ్డు నాణ్యతను ప్రశ్నిస్తున్నదన్నారు. వేశామని చెప్పుకోవడాని అన్నట్లుగా ఉందన్నారు. ఈ సీసీ రోడ్డును నాణ్యత లేకుండ, నిబంధనలు పాటిం చకుండా డస్ట్, కంకర కలిపి రోడ్డు వేశారన్నారు. ఇసుకన్న మాటే లేకుండా కంకర, డస్టుతోనే సీసీరోడ్లు వేస్తున్నారని అన్నారు. భగీరథ కాంట్రాక్టర్‌తో భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై నాసిరకం రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మున్సిపల్ లో అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో నా ణ్యత ప్రమానాలు పాటించకుండా వేస్తున్న ఈ సీసీరోడ్డు తీరే అవినీతికి అద్దం పట్టినట్టుగా ఉం దన్నారు. దీనిపై వెంటనే జిల్లా అధికారులు స్పం దించాలన్నారు. అందుకు సంబంధించిన బిల్లుల ను చేయకుండా విచారణ చేయాలని కోరారు.