Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్పత్తి మార్గాలను పెంచాలి
- సీబీఐటీ ప్రొఫెసర్ హరిహార
నవతెలంగాణ-గండిపేట్
సహజ వనరులను ప్రతి ఒక్కరూ సంరక్షిం చుకోవాలని సీబీఐటీ కాలేజీ ప్రొఫెసర్ హరిహార అన్నారు. గురువారం గండిపేట్లోని సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో హరిత భవనాలు గ్రీన్ బిల్డింగ్లు) నీరు, శక్తిని ఉపయోగించే సూచనలపై అవగాహన చేశామన్నారు. తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి పెంచడం నాణ్యమైన ఆరోగ్యకమైన భవనాలను నిర్మించడం వం టిని చేయాలన్నారు. దేశలో గ్రీన్ బిల్డింగ్స్ మార్కెట్ ప్రస్తుతం ప్రారంభంలో ఉందన్నారు. కేవలం 5 శాతం మాత్రమే హరిత భవనాలుగా వర్తికరించ బడ్డాయన్నారు. హరిత భవనాల గుర్తించి పూర్తి స్థాయిల్లో అవగాహన చేసుకోవాలన్నారు. అరోగ్యం, శ్రేయస్సు సౌకర్యాల గురించి మరింత జాగ్రతలు తీసుకోవాల న్నారు. మంచి వేంటిలేషన్ వ్యవస్థను కలిగి ఉండేందుకు భవనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, ఉపాధ్యాయులు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.