Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యల్లో నాణ్యతను పాటించాలి
- కార్యదర్శి డాక్టర్ రిజ్వానాబేగం
నవతెలంగాణ-గండిపేట్
లార్డ్ కాలేజీని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లి మంచి గుర్తింపు తీసుకురా వాలని కార్యదర్శి డాక్టర్ రిజ్వానాబేగం అన్నారు. గురువారం గండిపేట్ మండలం హిమాయత్‌సాగర్‌లోని లార్డ్ ఇంజనీరింగ్ కాలేజీలో స్వీడన్ స్టాక్ హౌమ్‌లో ఇటివల ముగిసిన ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీ, సైన్స్‌లో బిజినెన్ ఫోరంలో 2022 మెరుస్తున్నట్టు అభివర్ణించారు. మంచి వాతవ రణంలో కాలేజీని ఏర్పాటు చేసినందుకు కాలేజీకి గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్రంలోని మొదటి ఆటానామస్ కళాశాలగా నిలింద న్నారు. కాలేజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి అభినందనలు తెలిపా రు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు మంచి మార్గదర్శకాలను అందిస్తామ న్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ కోర్సులపై మంచి పట్టు సాధించి అనుకున్న లక్ష్యానికి చేరుకునే విధంగా కృషి చేస్తామన్నారు. విద్యార్థులు నాణ్యమైన సాంకేతిక విద్యనం దించడం కాలేజీ యాజమాన్యం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, సిబ్బంది, విద్యార్థులు, కాలేజీ నిర్వహకులు, తదితరులు పాల్గొన్నారు.