Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటి చూపు శిబిరం నిర్వహించడం అభినందనీయం
- మార్కెట్ కమిటీ చైర్మెన్, పాలకవర్గాన్ని అభినందించిన
- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- రైౖతులకు సేవ చేస్తున్నందుకు గర్వపడుతున్నా..
- త్వరలో రైతులకు ఐదు రూపాయలకే భోజనం
- మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ ముద్ద దీప భక్తవత్సలం
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
సార్వజనీన ఆరోగ్యమే తన ప్రథమ కర్తవ్యం అని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. గురు వారం వికారాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కంటి ఉచిత వైద్యలి శిబిరా న్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి శిబిరం ఏర్పాటు చేసినందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనుభవజ్ఞులు గల డాక్టర్లు అందుబాటులో ఉన్నారన్నారు. ఈ ఉచిత శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు
రైతుల శ్రేయస్సు కోసం కంటి చూపు ఉచిత శిబిరం : మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ ముద్ద దీప భక్తవత్సలం
మార్కెట్ కమిటీ తరఫున రైతులకు సేవచేసే అవకాశం వచ్చినందుకు తను చాలా గర్వపడుతున్నానని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ ముద్ద దీప భక్తవత్సలం అన్నారు. రెండు నెలలకు ఒకసారి రైతులకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కంటి చూపు వైద్య శిబిరంలో అవసరమైన వారికి ఆపరేషన్ గురించి పంపిస్తామన్నారు. కంటి చూపు సరిగా లేని వారికి కంటి అద్దాలు ఇస్తామన్నారు. కంటి చూపు మెరుగు పడేందుకు మందులు రక్త పరీక్ష నిర్వహించి సరియగు చికిత్స అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సహకారంతో మార్కెట్ కమిటీనీ మరింత అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో ఎమ్మెల్యే సహకారంతో రైతులకు ఐదు రూపాయలకే భోజనం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రైతులు తమ పంటను తీసుకొని మార్కెట్‌కు వచ్చి రాత్రిల్లో ఉంటారని వారికి రూ.5 భోజనం ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి ట్రేడ ర్స్ కమీషన్ ఏజెంట్లు, రైతులు, మార్కెట్ కమిటీ సిబ్బంది సహకారం పూర్తిగా ఉన్నదని పేర్కొన్నారు. భవిష్యత్తులో జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ము న్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, ఏఎంసీ వైస్ చైర్మెన్ ఎం. చంద్రశేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ ఏం.ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మెన్ విజరుకుమార్, కౌన్సిలర్ అనంత్‌రెడ్డి, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.