Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోని వైనం
- ఎప్పడికప్పుడు చెత్త సేకరించాలి: ఏడో వార్డు కౌన్సిలర్, కాలనీవాసులు
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్‌పల్లిలోని రామంతపూర్ వార్డులో చెత్త సేకరించే ట్రాక్టర్ రాకపోవడంతో ఎక్కడ చెత్త అక్కడే ఉండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుధ్య నిర్వాహణ సక్రమంగా లేదనీ మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించు కోవడం లేదని ఏడోవ వార్డు కౌన్సిలర్ అశోక్ ఆరోపించారు. గురువారం శంకర్పల్లి మున్సిపల్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్ ఏడోవ వార్డు పరిధిలో పారిశుధ్య నిర్వహణ ఈ విషయంలో కమిషనర్‌కు పలుమార్లు విన్న వించుకున్నా, పట్టించుకోవడం లేదన్నారు. చెత్త తీసుకుపోయే ట్రాక్టర్ గత నెలరోజులకు పైగా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.తమ వార్డులో ఎక్కడ వేసిన చెత్త అక్కడనే ఉండి పోయిం దన్నారు. వచ్చేది వర్షాకాలం అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందనీ ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త సేకరించేందుకు ఇద్దరు వర్కర్లను అదేవిధంగా చెత్త ట్రాక్టర్ పంపించాలని నెల రోజులుగా విన్నవించుకున్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధకరమన్నారు. తమ వార్డులో పేరుకుపోయిన చెత్త ఎప్పటికప్పుడూ తరలించాలని కోరారు. లేనియేడల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.