Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగా-కల్చరల్
డాక్టర్ గారూ, ఇంతకీ నా జబ్బు ఏమిటండి, ఇన్ని మాత్రలు మింగ లేక చస్తున్న, అని రోగి వైద్యుడిని అడిగితే నాకు తెలిస్తే 30 రకాల మందులు ఎందుకు రాస్తానయ్యా, ఆని సమాధానం, ఈ స్కిట్‌ను బాంక్ సుబ్రహ్మ ణ్యం, నరసింహం హాస్య బారితంగా నటించి ప్రేక్షకులను నవ్వులో ముంచెత్తారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదిక పై ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ వారిచే హాస్య జల్లుల వినోద విందు స్కిట్స్ ప్రదర్శి తమైనాయి. నిత్యం పాటల కార్యక్రమాలతో విసుగు చెందిన ప్రేక్షకులు నవ్వుల సందడితో ఊరట చెందారని ప్రముఖులు అన్నారు. జీ. నాగ రాజారావు, వీ.రమణ, ఏం. రాము, ఎల్. యెస్.ఆర్.మూర్తిలు అతిధులు గా పాల్గొని బ్యాంక్ సుబ్రహ్మణ్యం ఆలోచన లోంచి పుట్టిన కామెడీ క్లబ్ నిరటకంగా నడుస్తోందని అభినందించారు. మిమిక్రీ కళాకారుడు మోహన్ కృష్ణ నిర్వహణలో పలు స్కిట్స్ నవ్వులు పంచాయి.