Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
'మన ఊరు - మన బడి' కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపా యాల కల్పనకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాల యంలోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ 'మన ఊరు-మన బడి' పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటు గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ''మన ఊరు- మన బడి'' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఇందులో భాగం గా జిల్లాలో ఇప్పటి వరకు 76 శాతం పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఎన్ఆర్ ఈజీఎస్ కింద చేపట్టే కిచెన్ షెడ్స్, మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణపు పనులకు గ్రౌండింగ్ చేసి పరిపాలన పరమైన అనుమతులు పొంది పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. రూ.30 లక్షల లోపు గ్రౌండింగ్ అయిన పాఠశాలలకు విద్యుదీకరణ పనులు చేపట్టి రెండు రోజులలో పూర్తి చేయాలని సూచించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం పనుల పూర్తి వివరాలు, ఎన్ఆర్ఈజీఎస్ పనుల పూర్తి వివరాలు అందించి, పరిపాలన అనుమ తులు పొంది పనులను వేహవంతం చేయాలన్నారు. పాఠశాలలు త్వరలో ప్రారంభం కానున్నందున పాఠశాలల పనులను త్వరగా పూర్తి పూర్తి చేసి సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమారి, వివిధ ఇంజనీరింగ్ శాఖల ఈఈలు, డీఈలు, ఏఈఈలు, జిల్లా మేనేజర్ మహమూద్, తదితరులు పాల్గొన్నారు.