Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషలైట్ బినా మెహత
నవతెలంగాణ-మియాపూర్
చేనేత కారులను మరింత ఆదరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని నగర సోషలైట్ బినా మెహత అన్నారు. కోవిడ్ కారణంగా అన్ని రంగాలతో పాటు చేనేత రంగం కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని తెలిపారు. గ్రామీణ హస్తకళా వికాస్ సమితి నేతృత్వంలో మాదాపూర్లోని శిల్ప కళావేదికలో ఏర్పాటు చేసిన సిల్క్ ఇండియా వస్త్ర ప్రదర్శన -2022 ను సోషలైట్ బినా మెహత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కారులు ఒకే వేదికలో తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించేందుకు నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చేనేత కారులను, వారి ఉత్పత్తులను ఆదరించాలని కోరారు. భారతీయ సంస్కృతిలో సిల్క్, హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందనీ, నేటికి వాటిపై వన్నె తగ్గలేదని పేర్కొన్నారు. గ్రామీణ హస్తకళా వికాస్ సమితి ప్రతినిధి గుప్తా మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ ప్రదర్శనలో దేశంలోని 14 నగరాల నుంచి చేనేత కారులు, చేతి పని బందాలు తమ సిల్క్ చీరలు, హ్యాండ్ లూమ్ డ్రెస్ మెటీరియల్ వంటి 50 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు.