Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎమ్మెల్యే మెతకు ఆనంద్
నవతెలంగాణ-మర్పల్లి
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారనిటీిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఎంసీఎం ఫంక్షన్హాల్లో మండలానికి చెందిన 168 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబార్ చెక్కులను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథ కాలు పేదలకు వరంగా మారాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బట్టు లలిత రమేష్, జడ్పీటీసీ మధుకర్, పార్టీ మండలాధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామేశ్వర్, కో-ఆప్షన్ సభ్యులు సోహెల్ షరీఫ్, ప్రభాకర్ గుప్తా, రైతుబంధు అధ్యక్షులు నాయబ్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లేశం, ఎంపీటీసీ సంగీత, బట్టు రమేష్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు రాచన్న, మధుకర్, అశోక్, పట్టణ అధ్యక్షుడు గఫార్, మార్కెట్ డైరెక్టర్ గౌస్, నాయకులు గోపాల్ రెడ్డి, సురేష్, సోషల్ మీడియా మండల కన్వీనర్ వికాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.