Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
పరిగి మున్సిపాలిటీని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిషా ్టత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పరిగి పురపాలక సంఘం పరిధిలో 15వ వార్డులో అండర్ డ్రయినేజీ పనులను మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కాలనీలోని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణంలోని అన్ని వార్డుల్లో కాలనీలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కుల్చడం, బోరుబావులు పూడ్చడం, తాగునీటి వ్యవస్థ, అండర్ డ్రయినేజీ మురుగు నీటి సమస్యలు పరిష్కరి స్తామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కుని, చెత్తను ఎవరు కూడా బయట వేయకుండా, చెత్త సేకరించే వాహనంలోనే వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఎంపీపీ అరవింద రావు, పీఎసీఎస్ వైస్ చైర్మెన్ భాస్కర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు ఆంజనేయులు, టీఆర్ఎస్ సీనియర్ నాయ కులు ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్స్ వెంకటేష్, మునీర్, వేముల కిరణ్ కుమార్, నాగేశ్వర్, రవి కుమార్, కో-ఆప్షన్ సభ్యుడు ముకుంద శేఖర్,స్పెషల్ ఆఫీసర్ సుధారాణి పాల్గొన్నారు.