Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మున్సిపల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం శాయశక్తులా కషి చేస్తున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం శంకరపల్లి మున్సిపల్ పరిథిలో 7వ వార్డులో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులకు శంకుస్థాపన 11 వార్డులో సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి పనులను వేగవంతంగా పూర్తీ చేయలని ఆదేశించారు. శంకర్ పల్లి మున్సిపల్ జిల్లాలోని ఆదర్శ మున్సిపల్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. పట్టణ ప్రగతి పనులను మున్సిపల్ పరిధిలోని వార్డులలో నెల కొన్న సమస్యల పరిష్కరానికి పట్టణ ప్రగతి కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరిగౌడ్, మున్సిపల్ వైస్ చెర్మెన్ బి వెంకటరాంరెడ్డి, కౌన్సిలర్లు పార్శి రాధా బాలకృష్ణ, శ్వేత పాండురంగారెడ్డి, సీహెచ్ అశోక్, గండేటి శ్రీనాధ్ గౌడ్, కో-అప్షన్ షబనా బేగం, వెంకట్‌రెడ్డి, మైముద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.