Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజ్ వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గుర్రంపల్లి శ్యామల రాజు
నవతెలంగాణ-రాజేంద్రనగర్
నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, అదేవిధంగా 57 ఏండ్లు నిండిన వృద్ధులకు వెంటనే వద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని సమాజ్ వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గుర్రంపల్లి శ్యామల రాజు అన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇండ్లు లేని ప్రతీ పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కటించి ఇస్తామని హామీనిచ్చినట్టు తెలిపారు. నియోజకవర్గంలో ఎంతో మంది ప్రజలు ఇండ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. అదేవిధంగా 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు వద్ధాప్య పింఛన్ వెంటనే మంజూరు చేయాలన్నారు. నిరుపేదలకు ఇండ్లు కట్టించాలనీ, వద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలనికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ హామీనిచ్చారు.