Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ హమీద్ పటేల్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాల్గొ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొండాపూర్ డివిజన్ పరిధి రాజారాజేశ్వరి కాలనీలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి శేరిలింగంపల్లి సర్కిల్ జోనల్ కమిషనర్ శంకరయ్య, జీహెచ్ఎంసి అధికారులు, శానిటేషన్ సిబ్బంది, స్థానిక కాలనీ వాసులు, నాయకులతో కల్సి కొండాపూర్ కార్పొరేటర్ పాల్గొన్నారు. రాజా రాజేశ్వరి కాలనీ పరిసరాలలో ఉన్న మట్టి కుప్పలను, చెత్త కుప్పలను, రోడ్ల పై పడవేసిన బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ను, బండరాళ్లను, రోడ్డు పక్కల పడవేసిన ప్లాస్టిక్ కవర్లను, బాటిల్స్లను తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహనా ఉండాలన్నారు. పరిశుభ్రత పాటిస్తే అనారోగ్యాల భారిన పడకుండా ఉండవచ్చని సూచించారు. జీహెచ్ఎంసీి పారిశుధ్య కార్మికులు ప్రజలు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారికి సహకారం అందిచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావటం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ జీహెచ్ఎంసీ స్వచ్ ఆటోలను ఉపయోగించుకోవాలని, రోడ్ల పక్కన, మురుగు కాల్వలలో పడవేయకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఏంహెచ్ఓ డా. నగేష్, జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ ఏఈ రాజశేఖర్, శానిటేషన్ ఎస్ఆర్పి రాజయ్య, యస్ఎఫ్ఏ వేణు, రాజా రాజేశ్వరి కాలనీ ప్రెసిడెంట్ సుద్దపల్లి విజయకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ కొల్లూరు మధుముదిరాజ్, ఎమ్. శ్రీకాంత్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కొల్లూరు రమేష్ ముదిరాజ్, కాట్రగడ్డ బసవ శంకర్, కే. సంతోష్ కుమార్, సత్యేందర్ సింగ్ చౌదరి, అజరు సింగ్ చౌదరి, విజరు సింగ్ చౌదరి, సత్యనారాయణ, హరి కృష్ణనాయుడు, రవీందర్ సాగర్, శివ ముదిరాజ్, తిరుపతయ్య ముదిరాజ్, ప్రకాష్ రావు, జగదీష్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.