Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుర్చీ దిగే ప్రసక్తే లేదు
- తేల్చి చెప్పిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పదవి వివాదాస్పదమైంది. మున్సిపల్ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో గెలుపొం దిన మెజార్టీ కౌన్సిలర్లు తమను వికారా బాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నుకోన్నారని ఐదేండ్లపాటు పదవిలో కొనసాగుతానని సిట్టింగ్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల తేల్చి చెప్పారుజ టీఆర్ఎస్లో కొందరు తమను పదవి నుంచి దింపడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత పార్టీ అంతర్గతంగా చైర్పర్సన్ పదవుల పంపకంపై అంతర్గత ఒప్పందం చేసిన నిబంధనల ప్రకారం ఒప్పందాలు చెల్లవని అన్నారు. పార్టీపరంగా నాయకులు కౌన్సిలర్లు చైర్ పర్సన్ పదవి నుంచి తప్పిం చడానికి ఎన్ని తీర్మానాలు చేసిన తనే చైర్‌పర్సన్‌గా కొనసాగు తానని ధీమా వ్యక్తం చేశా రు. ఇదే విషయమై ఆమె మాట్లాడుతూ టీఆ ర్ఎస్ మైనారిటీలకు ప్రాధా న్యత ఇచ్చి వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్స న్గా ఎంపిక చేసిందని రెండున్నర ఏళ్ల పాటు పదవిలో కొనసాగా లని అధిష్ఠానవర్గం నిర్ణయా నికి కట్టుబడి ఉంటానని తెలియజేశారు. దీంతో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ వివాదం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది పార్టీ అధిష్టానం మేరకు రెండున్నర ఏండ్లపాటు పదవిలో కొనసాగాలని అప్పట్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో పదవుల పంపకం జరిగింది. ఇప్పుడు సిట్టింగ్ చైర్పర్సన్ మంజుల రమేష్ పదవి వదులుకోనని తేల్చి చెప్పారు.