Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి షఫీ
నవతెలంగాణ-దోమ
జర్నలిస్ట్‌ల సమస్యలను పరిష్కరించాలనీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి షఫీ అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి షఫీ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయనున్నట్టు చెప్పారు. అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌లకు అక్రిడేషన్లు జారీ చేసి, అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్ట్ హెల్త్ కార్డులు వర్తించేలా జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. జాప్యం చేయకుండా వెంటనే ఇండ్ల స్థలాలు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్‌లు వెంకట్ రాంరెడ్డి, చంద్రశేఖర్, శివభాస్కర్ రెడ్డి, అశోక్‌గౌడ్, రాజుగౌడ్, ఎండీ హఫీద్ పాల్గొన్నారు.