Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు టి.సుమంత్
నవతెలంగాణ-మంచాల
బస్పాస్ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు టి.సుమంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెలా నుంచి నేటి వరకూ మూడుసార్లు బస్స్ చార్జీలు పెంచారని అన్నారు. చార్జీలు పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పేద, మధ్య తరగతి విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి, పెంచిన బస్పాస్ చార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.