Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెరపైకి టీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలు
- చైర్పర్సన్ మంజులకు వ్యతిరేకంగా కౌన్సిలర్ల తీర్మానం
- చర్యలు తీసుకోవాలని అధిష్టాన వర్గానికి ఎమ్మెల్యే సిఫార్స్
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కుర్చీ కోసం టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల పదవి దిగిపోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజుల టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాలుపడుతున్నందున ఆమెపై చర్య తీసుకోవాలని అధిష్టాన వర్గానికి సూచిస్తూ పార్టీ నాయకులు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు వికారాబాద్ మున్సిపాలిటీలో అధికంగా గెలుపొందారు.అప్పట్లో కౌన్సిలర్ లంక పుష్పలత రెడ్డి సిట్టింగ్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, చైర్పర్సన్ పదవి కోసం పోటీ పడ్డారు. టీఆర్ఎస్ పార్టీ అంతర్గత ఒప్పందం ప్రకారం కౌన్సిలర్ మంజులను చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసి, రెండున్నరేండ్ల పాటు పదవిలో కొనసాగాలని ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఆమె పదవి కాలం రెండున్నరేండ్లు పూర్తి కావడంతో ఒప్పందం ప్రకారం కౌన్సిలర్ లంక పుష్పలత రెడ్డిని చైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడానికి టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే ముందు తీర్మానించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. మున్సిపల్ యాక్ట్ ప్రకారం మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతానని సిట్టింగ్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల భీష్మ మించడంతో విభేదాలు తెరపైకి వచ్చాయి అధిష్ఠానవర్గం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.